America: అమెరికాలో కారు ప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి

అతి వేగమే కారణం;

Update: 2024-05-22 01:15 GMT

 అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ-అమెరికన్‌ విద్యార్థులు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు శ్రీయ అవసరాల, ఆర్యన్ జోషి, అన్వీ శర్మగా గుర్తించారు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అల్ఫారెట్టాలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా… మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రిలో చేర్పించారు.

బాధితులంతా 18 ఏళ్ల వయసు గలవారు. యువకుడితో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. జార్జియాలోని అల్ఫారెట్టాలోని మాక్స్‌వెల్ రోడ్‌కు ఉత్తరాన వెస్ట్‌సైడ్ పార్క్‌వేలో మే 14న ఈ ప్రమాదం జరిగింది. ఆల్ఫారెట్టా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలిపారు. కారు చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ఐదుగురు ఉన్నారు. ఆల్ఫారెట్టా ఉన్నత పాఠశాల మరియు జార్జియా విశ్వవిద్యాలయ విద్యార్థులు. వారిని అల్ఫారెట్టా హైస్కూల్‌లో సీనియర్ ఆర్యన్ జోషి, జార్జియా యూనివర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీయ అవసరాల, అన్వీ శర్మగా గుర్తించారు.

గాయపడిన వారిని రిత్వాక్ సోమేపల్లిగా గుర్తించారు. ఇతడు జార్జియా స్టేట్ యూనివర్శిటీ విద్యార్థి. ఇక డ్రైవింగ్ చేస్తున్న మహమ్మద్ లియాకత్‌.. అల్ఫారెట్టా హై స్కూల్‌లో సీనియర్‌గా గుర్తించారు. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఆర్యన్ జోషి, శ్రియ అవసరాల ఘటనా స్థలంలో మృతి చెందారు. అన్వీ శర్మ నార్త్ ఫుల్టన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఇక ఏప్రిల్‌లో జరిగిన కారు ప్రమాదంలో గుజరాత్‌లోని ఆనంద్‌కు చెందిన ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్ మృతిచెందారు. 

Tags:    

Similar News