శ్వేత సౌధం వద్ద రెపరెపలాడుతున్న భారతీయ జెండా
మురిసిపోతున్న ప్రవాస భారతీయులు;
మరో నాలుగు రోజుల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ప్రారంభం కాబోతోంది. మోడీకి ఆతిథ్యం ఇచ్చేందుకు వైట్ హౌస్ సిద్ధం కాగా, సాంస్కృతిక మహోత్సవాలతో స్వాగతం చెప్పేందుకు భారతీయ అమెరికన్లు ఉత్సాహంతో ఉన్నారు.ప్రధాని మోదీ అమెరికా పర్యటన పై ప్రవాస భారతీయులు ప్రత్యేక ఉత్సాహం చూపిస్తున్నారు. శ్వేత సౌధం వద్ద జాతీయ జెండా రెపరెపలు చూసి మురిసిపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మోదీపై అభిమానాన్ని కురిపిస్తున్నారు. మరోవైపు విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం.. జూన్ 20 నుంచి 25 వరకు మోదీ అమెరికా ఈజిప్టు దేశాలలో పర్యటించనున్నారు. జూన్ 21న న్యూ యార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా జరిగే యోగా సెషన్‌కు ప్రధాని తొలిసారి నాయకత్వం వహించనున్నారు. భారతీయ యోగ ప్రాముఖ్యతని ప్రపంచానికి చాటి చెప్పనున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలు సబా కొరోసి కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. ఈ విషయం పై కొరోసి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి పాల్గొనడానికి తాను సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. తర్వాత ఆయన న్యూయార్క్ నుంచి అమెరికా రాజధాని వాషింగ్‌టన్‌కు చేరుకుంటారు. జూన్ 22న జరిగే స్టేట్ డిన్నర్‌లో బైడెన్ దంపతులు మోదీకి ఆతిథ్యం ఇస్తారు. జూన్ 22న కాంగ్రెస్ జాయింట్ సెషన్‌లో భారత ప్రధాని ప్రసంగించనున్నారు. జూన్ 23న రోనాల్డ్ రీగన్ బిల్డింగ్‌లో ప్రవాస నేతల సమావేశంలో మోదీ మాట్లాడతారు. అమెరికా పర్యాయతల నుంచి మోది నేరుగా ఈజిప్ట్ కు వెళ్లమన్నారు 24, 25 తేదీల్లో ఆయన ఈజిప్టులో పర్యటించనున్నారు. గతంలో ప్రధాని మోదీ అనేకసార్లు అమెరికా పర్యటనలు చేశారు. అయితే అందులో ఏ ఒక్కదాన్నీ అఫిషియల్‌గా స్టేట్‌విజిట్‌గా పేర్కొనలేదు. వాటిని ప్రాముఖ్యతను బట్టి అఫిషియల్ విజిట్స్, వర్కింగ్ విజిట్స్ లేదా గెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ విజిట్స్‌గా విభజించారు. అయితే ఈసారి మోదీ పర్యటనను స్టేట్ విజిట్ హోదాను కల్పించారు. ఒక దేశ అధ్యక్షుడు లేదా ప్రధాని మరొక దేశాన్ని అధికారికంగా సందర్శించడాన్ని స్టేట్ విజిట్ అంటారు. ఇది నాయకుడి సార్వభౌమాధికారాన్ని సూచిస్తుంది. అందుకే దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన పర్యటనగా పరిగణిస్తారు. స్టేట్ విజిట్ లో ఆహ్వాన వేడుకలు, 21-గన్ సెల్యూట్‌తో వైట్ హౌస్ అరైవల్ సర్మనీ, వైట్ హౌస్ డిన్నర్ అనంతరం యూఎస్ ప్రెసిడెంట్ గెస్ట్‌హౌస్ అయిన బ్లెయిర్ హౌస్‌లో బస చేసే అవకాశముంది. 2009లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా స్టేట్ విజిట్‌కు వెళ్లారు. ఇదే ఓ భారత నేత అమెరికాలో చేపట్టిన చివరి స్టేట్ విజిట్. తాజాగా మోదీ ఈ రికార్డును తిరగరాయనున్నారు.