ఆదాయపు పన్ను రద్దు దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసుకు నేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకుం టారని తెలుస్తోంది. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ప్రజలను ధనవంతులను చేసేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అమెరికా ప్రభుత్వానికి లభించే ఆదాయంలో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చేది భారీగానే ఉంటుంది. ఇతర దేశాల నుంచి వచ్చే వస్తు వులపై దిగుమతి సుంకం పెంచడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. 'ఇతర దేశాలను సుసంప న్నం చేసేందుకు మన వారిపై పన్నులు వేసే బదులు.. మనమే విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లను సంపన్నులు చేయాలి. వీటిని వసూలు చేసేందుకు ఎక్స్టెర్నల్ రెవెన్యూ సర్వీసును ప్రారంభించాను' అని రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికా చరిత్రలోనే 1870 నుంచి 1913 మధ్య ప్రజలు అత్యధిక సంపదతో తులతూగారని ట్రంప్ పేర్కొన్నారు. నాడు సుంకాల ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉండేదని చెప్పారు. అప్పట్లో దిగుమతి సుంకాల నుంచి ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆదాయం లభిం చేందన్నారు. అమెరికా తక్షణమే తన వాణిజ్య వ్యవస్థను మార్చుకోవాలన్నారు. అమెరికా ఉద్యోగులు, కుటుంబాలను రక్షించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇండియా, చైనా, బ్రెజిల్ అత్యధిక పన్నులు విధిస్తాయని, మనం అలా చేయొద్ద ని, అమెరికా ప్రయోజనాలే ముఖ్యంగా సంస్క రణలు చేద్దామని చెప్పారు.