Pakistan: పాక్‌లో భూకంప తీవ్రతను వివరిస్తున్న యాంకర్.. అంతలోనే..
Pakistan: పరిస్థితులు ఎలా ఉన్నా కొన్ని వృత్తుల్లో ఉన్నవారు తమ డ్యూటీ తాము చేయాల్సిందే. ముఖ్యంగా న్యూస్ రీడర్లు, రిపోర్టర్లు ప్రజలను అన్ని వేళలా అప్రమత్తం చేస్తుంటారు.;
Pakistan: పాక్‌లో భూకంప తీవ్రతను వివరిస్తున్నారు న్యూస్ రీడర్.. అంతలో సడెన్‌గా భూమి తీవ్రంగా కంపించింది. అయినా మధ్యలో ఆపకుండా, ఏమాత్రం తత్తరపాటుకు గురవకుండా తన పని తాను చేసుకుపోయారు. టెలివిజన్ ఫుటేజీలు వీధుల్లో భయాందోళనలకు గురైన పౌరులను చూపించాయి. పాకిస్థాన్‌లో భూకంపం కారణంగా స్టూడియో తీవ్రంగా వణుకుతున్నప్పటికీ టీవీ యాంకర్ వార్తలు అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగళవారం రాత్రి ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు బలమైన భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం పాకిస్తాన్‌ను కూడా వణికించింది. ఈ తీవ్రంతకు దేశంలో కనీసం తొమ్మిది మంది మరణించారు. 160 మందికి పైగా గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌లో కూడా ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. ఒక వినియోగదారు ఇలా ట్వీట్ చేశారు: భూకంపం సమయంలో యాంకర్ ధైర్యానికి హ్యాట్సాఫ్.. ప్రతికూల పరిస్థితులలోనూ తన ప్రత్యక్ష కార్యక్రమాన్ని కొనసాగించాడు." అని నెటిజన్స్ ట్వీట్ చేస్తున్నారు. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Pashto TV channel Mahshriq TV during the earthquake. Bravo anchor continued his live program in the ongoing earthquake.
— Inam Azal Afridi (@Azalafridi10) March 21, 2023
#earthquake #Peshawar pic.twitter.com/WC84PAdfZ6