Ukrainian Grandmother : 'నా దేశం కోసం నేను' ...ఏకే-47 పట్టిన 79 ఏళ్ల బామ్మ..!

Ukrainian Grandmother : ఉక్రెయిన్‌లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య సంఘర్షణ, ఉద్రిక్తతలు తగ్గడం లేదు.;

Update: 2022-02-16 14:30 GMT

Ukrainian Grandmother : ఉక్రెయిన్‌లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య సంఘర్షణ, ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఉక్రెయిన్ సరిహద్దులో దాదాపుగా లక్షా 30 వేలకు పైగా సైన్యాన్ని మోహరించింది రష్యా. ఉత్తర,దక్షిణ, తూర్పు సరిహద్దులన్నింటినీ చుట్టుముట్టింది. ఏ క్షణమైనా రష్యా దాడి చేసే అవకాశం ఉందని.. యుద్ధం తప్పదని అమెరికా, బ్రిటన్‌లు అంచనా వేస్తున్నాయి.

ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు చెందిన వాలెంటినా అనే 79ఏళ్ల ఓ బామ్మ నా దేశం కోసం నేను పోరాడుతాను నా దేశాన్ని ఓడిపోనివ్వను అంటూ ఆయుధాలని చేత పట్టి శిక్షణ తీసుకుంటుంది. ఈ శిక్షణకు చిన్నారులు, వృద్ధులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని మరియుపోల్‌లో 79 ఏళ్ల వాలెంటినా ఈ ట్రెయినింగ్‌లో పాల్గొని జాతీయ భద్రతా సిబ్బంది నుంచి ఏకే - 47 తుపాకీని ఎలా ఉపయోగించాలో ట్రైనింగ్ తీసుకున్నారు.

తుపాకీ చేతబట్టి లక్ష్యానికి గురిపెడుతున్న వాలెంటినా ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "ఏదైనా జరిగితే కాల్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను నా ఇల్లు, నా నగరం, నా పిల్లలను రక్షించుకుంటాను. నేను దీనికి సిద్ధంగా ఉన్నాను.. నా దేశాన్ని కోల్పోవాలని నేను కోరుకోవడం లేదు" అని అంటోంది ఈ బామ్మ... ఉక్రెయిన్‌ పౌరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఈ బామ్మకి ఉన్న దేశభక్తిని అభినందిస్తున్నారు. 

Tags:    

Similar News