US: ఖురాన్ మీద ప్రమాణం చేసిన తొలి మేయర్

న్యూయార్క్‌ మేయర్‌గా  మమ్దానీ ... ఖురాన్‌ ప్రతులపై ప్రమాణం ... ఉమర్​ ఖలీద్​కి లేఖ

Update: 2026-01-02 10:00 GMT

అమె­రి­కా వా­ణి­జ్య రా­జ­ధా­ని న్యూ­యా­ర్క్‌ నగర 112వ మే­య­ర్‌­గా భా­ర­తీయ మూ­లా­లు­న్న 34 ఏళ్ల  జో­హ్రా­న్‌ మమ్దా­నీ ప్ర­మాణ స్వీ­కా­రం చే­శా­రు. నూతన సం­వ­త్స­రం సం­ద­ర్భం­గా న్యూ­యా­ర్క్‌ ఓల్డ్‌ సిటీ హా­ల్‌ సబ్‌­వే స్టే­ష­న్‌ వద్ద ని­రా­డం­బ­రం­గా ఈ కా­ర్య­క్ర­మం జరి­గిం­ది. మమ్దా­నీ కు­టుంబ సభ్యు­లు, సల­హా­దా­రు­లు, సన్ని­హి­తు­లు హా­జ­ర­య్యా­రు. న్యూ­యా­ర్క్‌ మే­య­ర్‌­గా ఎన్ని­కైన తొలి దక్షి­ణా­సి­యా­వా­సి­గా, తొలి ము­స్లిం­గా, రెం­డో పి­న్న వయ­స్కు­డి­గా మమ్దా­నీ రి­కా­ర్డు­కె­క్కిన సం­గ­తి తె­లి­సిం­దే. ఆయ­న­తో స్టే­ట్‌ అటా­ర్నీ జన­ర­ల్‌ లె­టీ­టి­యా జే­మ్స్‌ ప్ర­మా­ణం చే­యిం­చా­రు. మమ్దా­నీ రెం­డు ఖు­రా­న్‌ ప్ర­తు­ల­పై ప్ర­మా­ణం చే­య­డం గమ­నా­ర్హం. ఈ సం­ద­ర్భం­గా భా­ర్య రమా దు­వా­జీ పక్క­నే ఉన్నా­రు.  

ప్ర­ఖ్యాత బా­లీ­వు­డ్‌ దర్శ­కు­రా­లు మీరా నా­య­ర్, కొ­లం­బి­యా యూ­ని­వ­ర్సి­టీ ప్రొ­ఫె­స­ర్‌ మహ­మూ­ద్‌ మమ్దా­నీల కు­మా­రు­డైన జో­హ్రా­న్‌.. ఉగాం­డా రా­జ­ధా­ని కం­పా­లా­లో జన్మిం­చా­రు. ఏడే­ళ్ల వయ­సు­లో కు­టుం­బం­తో కలి­సి అమె­రి­కా చే­రు­కు­న్నా­రు. 2018లో అమె­రి­కా పౌ­ర­స­త్వం పొం­దా­రు. మే­య­ర్‌­గా న్యూ­యా­ర్క్‌ నగర అభి­వృ­ద్ధి, ప్ర­జల సం­క్షే­మం కోసం పని­చే­స్తా­న­ని మమ్దా­నీ ప్ర­క­టిం­చా­రు. తన ప్ర­మాణ స్వీ­కా­రం నూతన అధ్యా­యా­ని­కి ప్రా­రం­భం­గా అభి­వ­ర్ణిం­చా­రు. ప్ర­మాణ స్వీ­కా­రా­ని­కి వే­ది­క­గా పాత సబ్‌­వే స్టే­ష­న్‌­ను ఎం­చు­కో­వ­డా­ని­కి గల కా­ర­ణా­న్ని వి­వ­రిం­చా­రు. ఇది 1904లో ప్రా­రం­భ­మైం­ద­ని, ఘన చరి­త్ర కలి­గి ఉం­ద­ని పే­ర్కొ­న్నా­రు.  ప్ర­జల జీ­వి­తా­ల­ను మా­ర్చే­లా తె­లి­వైన, సా­హ­సో­పేత ని­ర్ణ­యా­లు తీ­సు­కో­వ­డా­ని­కి ఇదొక ప్ర­తీక అని చె­ప్పా­రు. ప్ర­మా­ణం కోసం మమ్దా­నీ ఉప­యో­గిం­చిన ఖు­రా­న్‌ ప్ర­తు­ల­కు కూడా ఆస­క్తి­క­ర­మైన నే­ప­థ్యం ఉంది. ఇం­దు­లో ఒకటి మమ్దా­నీ తాత నుం­చి వా­ర­స­త్వం­గా వచ్చిం­ది. మరొ­క­టి న్యూ­యా­ర్క్‌ పబ్లి­క్‌ లై­బ్ర­రీ నుం­చి తీ­సు­కొ­చ్చా­రు. దీ­ని­కి 200 ఏళ్ల చరి­త్ర ఉంది. నల్ల జా­తీ­యుల సం­స్కృ­తి­పై స్కో­మ్‌­బ­ర్గ్‌ సెం­ట­ర్‌ ఫర్‌ రీ­సె­ర్చ్‌ సం­స్థ అధ్య­య­నం చే­సిం­ది. ఈ క్ర­మం­లో­నే పలు ఖు­రా­న్‌ ప్ర­తు­ల­ను, పు­స్త­కా­ల­ను సే­క­రిం­చిం­ది. వీ­టి­ని న్యూ­యా­ర్క్‌ పబ్లి­క్‌ లై­బ్ర­రీ­లో భద్ర­ప­రి­చా­రు. అం­దు­లో ఒకటి మమ్దా­నీ ఉప­యో­గిం­చిన ఖు­రా­న్‌ కా­వ­డం వి­శే­షం. తమ లై­బ్ర­రీ నుం­చి తీ­సు­కె­ళ్లిన ఖు­రా­న్‌­పై మే­య­ర్‌ ప్ర­మా­ణం చే­య­డా­న్ని గొ­ప్ప గౌ­ర­వం­గా భా­వి­స్తు­న్నా­మ­ని లై­బ్ర­రీ సీఈఓ ఆం­థో­నీ డబ్ల్యూ మా­ర్క్స్‌ చె­ప్పా­రు. ఖు­రా­న్‌­పై ప్ర­మా­ణం చే­సిన తొలి న్యూ­యా­ర్క్‌ మే­య­ర్‌­గా జో­హ్రా­న్‌ మరో రి­కా­ర్డు సృ­ష్టిం­చా­రు.

ఉమర్​ ఖలీద్​కి లేఖ

ఢిల్లీ అల్లర్ల కేసులో జైలులో మగ్గుతున్న ఉమర్ ఖలీద్‌కు న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ సంఘీభావం తెలిపారు. ఖలీద్ తల్లిదండ్రులను కలిసి, ఆయన రాసిన లేఖను స్వయంగా అందజేశారు. "ప్రియమైన ఉమర్, చేదు అనుభవాలు మనల్ని మింగేయకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో నువ్వు చెప్పిన మాటలు నాకు తరచూ గుర్తుకు వస్తుంటాయి. మీ తల్లిదండ్రులను కలవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాము," అంటూ మమ్దానీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఉమర్ ఖలీద్ తల్లిదండ్రులు సహిబా ఖానమ్, సయ్యద్ ఖాసిమ్ రసూల్ ఇలియాస్ తమ చిన్న కుమార్తె వివాహానికి ముందు అమెరికాలో ఉంటున్న మరో కుమార్తెను కలవడానికి వెళ్లారని ఉమర్ ఖలీద్ భాగస్వామి బనోజ్యోత్స్న లాహిరి తెలిపారు. ఆ సమయంలోనే వారు మేయర్ మమ్దానీని కలిసి కొంత సమయం గడిపారు.

Tags:    

Similar News