HIV: సెక్స్‌ వర్కర్‌ నిర్లక్ష్యం.. హెచ్‌ఐవీ ఉన్నా 200 మందితో ..

టెస్ట్‌లు చేయించుకోవాలన్న అధికారులు;

Update: 2024-05-21 04:15 GMT

అమెరికా ఓహియో రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల మహిళా సెక్స్ వర్కర్ తనకు హెచ్ఐవీ-పాజిటివ్ అని తెలిసినప్పటికీ, 200 మందితో సంబంధాన్ని కలిగి ఉంది. తాజాగా ఈ  భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అది గుర్తించిన అధికారులు.. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ హెచ్ఐవీ టెస్ట్‌లు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

ఈ సంఘటన అమెరికాలోని ఓహైయో రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇంతటి దారుణానికి కారణమైన లిండా లెచెసె అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తనకు హెచ్ఐవీ సోకిన విషయం లిండా లెచెసెకు తెలుసని.. తెలిసిన తర్వాత కూడా శృంగారం కొనసాగించిందని పోలీసులు గుర్తించారు. లిండా లెచెసెకు రెండేళ్ల క్రితమే ఎయిడ్స్ సోకిందని.. అప్పటి నుంచి 211 మందితో ఆమె శృంగారం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న వారందరూ హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని స్థానిక ప్రభుత్వం సూచిస్తోంది. అయితే ఈ సంఘటన గురించి విని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే లిండా లెచెసేను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.

ఒహైయో రాష్ట్రంలోని మరియెట్టా ప్రాంతానికి చెందిన లిండా లెచెసే చాలా ఏళ్లుగా సెక్స్‌ వర్కర్‌గా పనిచేస్తోంది. 2022 జనవరి నుంచి ఇప్పటివరకు ఎంతో మందితో లిండా లెచెసె సెక్స్ సంబంధాలు ఏర్పరుచుకుని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే మొదట్లోనే ఆమె హెచ్‌ఐవీ టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. అయితే తనకు హెచ్ఐవీ ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పని లిండా లెచెసే.. సెక్స్ వర్కర్‌గా తన వద్దకు వచ్చిన వారితో శృంగారం చేస్తూనే వస్తోంది. 2022 నుంచి ఇప్పటివరకు గత రెండున్నర సంవత్సరాలుగా లిండా లెచెసె దాదాపు 211 మందితో శృంగారం చేసినట్లు అధికారులు చేసిన విచారణలో గుర్తించారు. దీంతో ఈమె సంబంధం ఉన్న వ్యక్తులు, వారితో పరిచయం ఉన్న ఇతరులు కూడా ప్రమాదకర పరిస్థితుల్ని కలిగి ఉంటారని అధికారులు చెబుతున్నారు. మే 13న లెక్సెస్‌ని అరెస్ట్ చేశారు. ఆమెకు హెచ్‌ఐవీ ఉందన్న విషయం తెలుసని పోలీసులు చెప్పారు. ఇది థర్డ్ డిగ్రీ నేరమని అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News