Heart Transplantation: మనిషికి పంది గుండె
రెండు రోజుల్లోనే కోలుకున్న రోగి;
అమెరికా వైద్యులు మరోసారి పంది గుండెతో మనిషి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు అవయవమార్పిడి శస్త్రచికిత్స ద్వారా రెండోసారి జన్యుమార్పిడి చేసిన పంది గుండెను మనిషికి అమర్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ రోగికి పంది గుండె అమర్చారు. అమెరికాలో ఇలాంటి అరుదైన చికిత్స జరగడం అమెరికాలో ఇది రెండోసారి.. అయితే అయితే, శస్త్రచికిత్స తరువాత రోగి వేగంగా కోలుకోవడం వైద్యులనే ఆశ్చర్యపరుస్తోంది. ఆపరేషన్ జరిగిన రెండో రోజునే రోగి ఉత్సాహంతో ఉరకలెత్తుతూ జోకులు వేయడం ప్రారంభించాడని వారు తెలిపారు.
మరణం అంచులకు చేరుకున్న 58 ఏళ్ల వ్యక్తిని కాపాడేందుకు చివరి ప్రయత్నంగా ఆపరేషన్ నిర్వహించారు. అనారోగ్య కారణాలు, హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా రోగిలో పంది గుండె అమర్చాల్సి వచ్చిందని వైద్యులు వివరించారు. బాధితుడు లారెన్స్ ఫాసెట్ నావికాదళంలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. 58 ఏళ్ల వయసున్న లారెన్ ఫాసెట్ గుండె వైఫల్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతను మరణానికి చేరువయ్యాడు. అంతేకాకుండా ఇతర వ్యాధులు కూడా ఉండటంతో సంప్రదాయ గుండె మార్పిడికి అవకాశం లేకుండాపోయింది.
దీంతో అతనికి పంది గుండెను అమర్చేందుకు అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడిసిన్’ డాక్టర్లు సిద్ధమమయ్యారు. జంతువు గుండె మనిషికి అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఇటీవల లారెన్స్ ఫాసెట్‌కు వైద్యులు పంది గుండెను అమర్చారు. ఈ చికిత్స విజయవంతమవడంతో రోగి ప్రాణాలు కాపాడినట్లైంది. అపరేషన్ నిర్వహించిన రెండు రోజుల విశ్రాంతి తర్వాత అతడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు అయితే, శస్త్రచికిత్స తరువాత రోగి వేగంగా కోలుకోవడం వైద్యులనే ఆశ్చర్యపరుస్తోంది. ఆపరేషన్ జరిగిన రెండో రోజునే రోగి ఉత్సాహంతో ఉరకలెత్తుతూ జోకులు వేయడం ప్రారంభించాడని వారు తెలిపారు.
అయితే, రానున్న కొన్ని వారాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. గతేడాదే ఈ యూనివర్సిటీ వైద్యులు ప్రపంచంలోనే తొలిసారిగా ఓ పంది గుండెను డేవిడ్ బెన్నెట్ అనే రోగికి అమర్చి రికార్డు సృష్టించారు. అయితే, ఆపరేషన్ జరిగిన రెండు రోజులకే బెన్నెట్ మృతి చెందాడు. అయితే గతంలో పంది గుండె అమర్చిన వ్యక్తి రెండు నెలల్లోనే చనిపోయాడన్న విషయం తెలిసి కూడా లారెన్స్ ఫాసెట్ ఈ ప్రయోగానికి సిద్ధపడ్డాడు.