Queen Elizabeth II: రాణి ఎక్కడకు వెళ్లినా బ్లాక్ బ్యాగ్.. సీక్రెట్ ఏంటో తెలుసా!!

Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్ II పరిపూర్ణ జీవితాన్ని అనుభవించి తృప్తిగా తన 96వ ఏట తనువు చాలించారు. ముదిమి వయసులోనూ ఆమె వేషధారణ ప్రపంచ ప్రజలను ముచ్చటగొలిపేది.

Update: 2022-09-28 11:30 GMT

Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్ II పరిపూర్ణ జీవితాన్ని అనుభవించి తృప్తిగా తన 96వ ఏట తనువు చాలించారు. ముదిమి వయసులోనూ ఆమె వేషధారణ ప్రపంచ ప్రజలను ముచ్చటగొలిపేది. ముఖ్యంగా ఆమె టోపీ, హ్యాండ్ బ్యాగ్ ఆకర్షణీయంగా ఉండేవి. రాణి ఎక్కడకు వెళ్లినా కచ్చితంగా నల్ల బ్యాగ్ చేతిలో ఉండేది.

ఆమె దగ్గర అలాంటి బ్యాగులు 200 వరకు ఉండేవట. అవన్నీ లండన్‌కు చెందిన లెదర్ గూడ్స్ కంపెనీ రాణి కోసం స్పెషల్‌గా లానర్ తయారు చేసి ఇచ్చేవారట.

1950 నుండి 2022 వరకు రాణికి సంబంధించిన అనేక ఫోటోలు మరియు వీడియోలలో నల్లని బ్యాగ్‌ ధరించి ఉన్న ఫోటోలు కనిపించేవి. రాణి బ్యాగ్ లేకుండా బయటకు వెళ్లే వారు కాదు. అందరి మహిళల మాదిరిగానే ఆమె బ్యాగులో కూడా లిప్‌స్టిక్, అద్దం వంటి మేకప్ సామాగ్రిని మాత్రమే ఉంచుకునేవారు. అయితే ఆమె బ్యాగ్ పట్టుకునే విధానం లేదా పెట్టే విధానం బట్టి సిబ్బందికి సమాచారం అందజేసేవారట. మాట్లాడకుండానే బ్యాగ్ ద్వారా సిగ్నల్స్ పాస్ చేసేవారట.

క్వీన్ ఎలిజబెత్ సిబ్బందితో రహస్య సంభాషణల కోసం తన హ్యాండ్‌బ్యాగ్‌ను ఉపయోగించే వారని నివేదికలు వెలువడ్డాయి. గ్రేట్ బ్రిటన్ రాణి ఎవరితోనైనా సంభాషణ సమయంలో తన హ్యాండ్‌బ్యాగ్‌ను ఎడమ చేతి నుండి కుడి చేతికి తరలించినప్పుడల్లా, ఆమె ఆ వ్యక్తితో సంభాషణను ముగించాలనుకుంటుందని అర్థం.

అదేవిధంగా, రాణి సంభాషణ సమయంలో తన బ్యాగ్‌ని నేలపై ఉంచినప్పుడు, ఆమె ఆ వ్యక్తితో మరింత సమయాన్ని గడపడం ఆమెకు ఇష్టం లేదని, వెళ్లిపోవాలనుకుంటున్నట్లు ఆమె సిబ్బందికి సంకేతం అందించేవారట.

రాణి భోజన సమయంలో తన బ్యాగ్‌ని టేబుల్‌పై ఉంచిన ప్రతిసారి ఆమె తన భోజనాన్ని 5 నిమిషాల్లో పూర్తి చేస్తుందనడానికి సంకేతం. గ్రేట్ బ్రిటన్ రాణి బ్యాగ్‌లో గాజులు, లిప్‌స్టిక్ మరియు గాజులతో సహా సాధారణ మహిళల వంటి రోజువారీ వస్తువులు కూడా ఉన్నాయని రాజ కుటుంబానికి చెందిన జీవిత చరిత్ర రచయిత మీడియాకు తెలిపారు.

Tags:    

Similar News