Who is Sneha Dubey : ప్రధాని అని కూడా లెక్కచేయలేదు.. ఎవరీ స్నేహా దూబే.. ?

Who is Sneha Dubey : సమయం, సందర్భం దొరికితే చాలు భారత్ పై కాలు దువ్వెందుకు ఎప్పుడు ముందుంటారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..

Update: 2021-09-25 12:20 GMT

Who is Sneha Dubey : సమయం, సందర్భం దొరికితే చాలు భారత్ పై కాలు దువ్వెందుకు ఎప్పుడు ముందుంటారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఈసారి కూడా అదే చేశారు కానీ... ఆయన విమర్శలను దాదాపుగా మూడు పదుల వయసు కూడా లేని ఓ అమ్మాయి ప్రధాని అని కూడా లెక్కచేయకుండా ఏకిపారేసింది. జమ్మూ కశ్మీర్ మాది..లఢక్ మాది అంటూ ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను, పాకిస్థాన్ వ్యవహరించే తీరుపై యూఎన్ సాక్షిగా చీల్చి చెండాడిందామే. ఐక్యరాజ్యసమితి వేదికగా జరిగిన ఈ ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. ఇంతకీ ఎవరా అమ్మాయి..?

చూడడానికి బక్కపలుచగానే ఉంది..కానీ అక్కడ ఆమె మాటలు మాత్రం బలంగా ఉన్నాయి. ఆమె మాట్లాడిన విధానం, వాస్తవాలను ఎండగట్టడంలో ఆమె వైఖరి అందర్నీ కట్టిపడేసింది. దీంతో ఎవరీ అమ్మాయని నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలు పెట్టేశారు. ఆమె పేరు స్నేహా దూబే.. పుట్టింది గోవాలో.. తండ్రి వ్యాపారవేత్త కాగా, తల్లి ఉపాధ్యాయురాలు. గోవాలోనే ప్రాధమిక విద్యను పూర్తి చేసిన ఆమె.. పుణెలో కళాశాల విద్యను కంప్లీట్ చేసింది. ఆ తర్వాత ఢిల్లీలోని జేఎన్‌యూ నుంచి ఎంఫిల్ పట్టా పొందింది.

12 యేళ్ల వయసులోనే ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ లో ఉద్యోగం చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. లక్ష్యానికి తగ్గట్టుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సివిల్స్‌ పరీక్షలో ఫస్ట్ అటెంప్ట్ లోనే ఐఎఫ్‌ఎస్‌గా ఎంపికైంది. 2012 బ్యాచ్‌కు చెందిన దూబే మొదటి పోస్టింగ్‌ విదేశాంగ శాఖలో. ఆ తర్వాత 2014లో స్పెయిన్‌లోని భారత దౌత్యకార్యాలయానికి బదిలీ అయింది. ప్రస్తుతం ఆమె ఐరాసలో భారతదేశ మొదటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తుంది.

ఈ నేపధ్యంలో యూఎన్ లో తన పదునైన మాటలతో పాక్‌ కి గట్టి సమాధానం ఇచ్చింది. వాస్తావానికి గ‌తంలో కూడా యూఎన్‌లో ఇండియా త‌ర‌పున మ‌హిళా ప్రతినిధులు కూడా బాగానే మాట్లాడారు కానీ స్నేహా దూబే వాక్చాతుర్యం అందర్ని కట్టిపడేసింది. ఒక్క మాట కూడా అనవసరంగా మాట్లాడలేదు. దీనితో సోషల్ మీడియాలో ఆమె పైన ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె మాట్లాడిన వీడియోలను పోస్ట్ చేస్తూ సూపర్బ్ మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News