China: వెయిట్ తగ్గు, గిప్ట్ పట్టు ..ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన చైనా కంపెనీలు

బరువు తగ్గడం కోసం ఉద్యోగులకు బంఫర్ ఆఫర్..

Update: 2025-09-08 07:15 GMT

చైనాలోని కొన్ని కంపెనీలు ఉద్యోగులకు చిత్ర విచిత్రమైన ఆఫర్లు ఇస్తుంటాయి. తాజాకే ఇలాంటిదే ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది చైనాలోని ఓ కంపెనీ..

పూర్తి వివారాల్లోకి వెళితే…చైనా కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ అంటే వర్క్ కాంపిటీషన్ పెట్టి.. బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారికి ప్రైజ్ లు ఇవ్వటం కాదు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. వారి కోసం ఓ పోటీని నిర్వహించింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయానికి నెటిజన్లు మంచి ఆఫర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

షెంజెన్ లో ఉన్న ఆరాషి విజన్ అనే టెక్నాలజీ కంపెనీ వినూత్నమైన పోటీలు నిర్వహించి ఉద్యోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఇనిషియేషన్ కు శ్రీకారం చుట్టింది. మొత్తం ఒక కోటి 23 లక్షల రూపాయల బోనస్ ను ఉద్యోగులకు ప్రకటించింది. వెయిట్ లాస్ అవుతూ ఆరోగ్యంగా తయారయ్యేందుకు ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొంది.

కంపెనీ పెట్టిన వెయిట్ లాస్ ఛాంపియన్ ప్రోగ్రాంకు అనూహ్య స్పందన వచ్చింది. ఉద్యోగులు పోటీ పడి మరీ బరువు తగ్గుతున్నారు. గ్సై యాక్వీ అని ఉద్యోగి ఏకంగా మూడు నెలల్లోనే 20 కేజీలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో కంపెనీ అతినిక వెయిట్ లాస్ ఛాంపియన్ అవార్డుతో పాటు రూ.2 లక్షల 34 వేల ప్రైజ్ మనీ కూడా అందజేసింది.

ప్రతి సీజన్ లో 30 మంది ఉద్యోగులు ఈ కాంపిటీషన్ లో పాల్గొంటారు. ప్రతి అరకిలో (0.5kg) తగ్గుదలకు దాదాపు 6 వేల రూపాయలు ఇస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. 2022 నుంచి ఈ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 7 రౌండ్ల పోటీలు జరిగాయి. ఈ పోటీల కోసం ఇప్పటి వరకు రూ.2 కోట్ల 34 లక్షలను వెచ్చించినట్లు తెలిపారు. ఈ కాంపెటీషన్ వలన ఉద్యోగుల ఆరోగ్యంతో పాటు హెల్దీ లైఫ్ స్టైల్ ప్రమోట్ చేయాలని భావించినట్లు కంపెనీ చెబుతోంది. దీని కారణంగా ఉద్యోగుల పర్ఫామెన్స్ కూడా పెరిగి కంపెనీ ప్రొడక్టివిటీలో మంచి రిజల్ట్స్ వచ్చినట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News