Zelensky-Meme: వైరల్‌గా మారిన జెలెన్‌స్కీ ఫోటో, మీమర్స్‌కి పండగే..!
జెలెన్‌స్కీ వారిని చూస్తూ బాధపడుతున్నట్లు, నిరాశగా ఉన్నట్లు పక్కన నిల్చున్నాడు.;
నాటో(NATO) సమ్మిట్‌కి హాజరైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) ఇప్పుడు మీమ్(Meme)గా మారాడు. ఆ సమావేశం సందర్భంగా ఓ అనుకోని సమయంలో తీసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.
నాటో సదస్సుకు హాజరైన ప్రతినిధులు అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఆనందంలో ఉండగా, జెలెన్‌స్కీ వారిని చూస్తూ బాధపడుతున్నట్లు, నిరాశగా ఉన్నట్లు పక్కన నిల్చున్నాడు.
ఇటువంటి చిత్రం దొరకడమే ఆలస్యం, ఆన్‌లైన్‌లో ఉన్న మీమర్స్ అంతా తమ మెదడుకు పదును పెట్టి వారికి తోచిన విధంగా చేస్తూ ఫన్నీ మీమ్స్‌తో వైరల్ చేస్తున్నారు.
మొదటగా ఈ చిత్రాన్ని జర్నలిస్ట్ సైమన్ అటేబా ట్విట్టర్‌లో షేర్ చేయడం మొదలు వైరల్ అయింది.
ఇక సోషల్ మీడియా యూజర్లు తమకు తోచిన విధంగా ఆ ఫోటోని మలుచుకున్నారు.
"గ్రూప్‌లోని సభ్యులకు మాత్రమే ఆహ్వానం ఉన్న పార్టీకి, ఆహ్వానం లేని వారు వెళితే ఇలాగే ఉంటుంది" అని ఒక యూజర్ అన్నారు.
"నేను తప్ప జీవితంలో అందరూ సంతోషంగా ఉన్నట్లుంది" అన్నట్లుగా మరో యూజర్ పోస్ట్ చేశాడు.
నాటోలో చేరాలంటే ఇంత ఎత్తు ఉండాలమో అన్నట్లుగా మరో యూజర్ ఫోటోని రూపొందించాడు.
మరో యూజర్ ఫేమస్ పాకిస్థానీ అభిమాని మీమ్‌ని రీక్రియేట్ చేశాడు.
ఫోటో సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం యూరప్‌లో ఉక్రెయిన్ పరిస్థితి ఇలా ఉన్నట్లుగా పరిస్థితులు అన్పిస్తున్నాయి.
మీమ్స్ సంగతి పక్కన పెడితే ఉక్రెయిన్ అధ్యక్షుడు తమని నాటో కూటమిలో చేర్చాలని సభ్య దేశాలను ఒత్తిడి పెడుతున్నాడు. అయితే దీనికి పలు దేశాలు మద్దతు తెలుపుతుండగా, ఇప్పుడే మద్దతిస్తే రష్యాతో యుద్ధం కొని తెచ్చుకున్నట్లే అని ఇతరులు ఆలోచిస్తున్నారు.
"నాటోలో ఆహ్వానం కోసం మేము స్పష్టమైన సంకేతం కోసం ఎదురుచూస్తున్నాం. మన బంధాల్లో నిజాయితీ ఉండాలని మేం కోరుకుంటున్నాం " అని జెలెన్‌స్కీ వెల్లడించాడు.