వివేకా హత్య కేసులో దస్తగిరి సంచలన వ్యాఖ్యలు

వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కారు సహకరించి ఉంటే పది రోజుల్లోనే దర్యాప్తు పూర్తయ్యేదన్నారు. కేసు తెలంగాణకు బదిలీ కావడంతో విచారణ వేగవంతమైందని, ఆధారాలు ఉండటం వల్లే ప్రముఖుల్ని సీబీఐ అధికారులు విచారించారన్నారు. ఈ మాట నేను గతంలోనే చెబితే అబద్దాలన్నారని, త్వరలోనే నిజాలు బయటికి వచ్చే అవకాశం ఉందని దస్తగిరి చెప్పారు.
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు నిందితులందరికి నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా వివేక మాజీ డ్రైవర్ దస్తగిరికి సమన్లు ఇచ్చింది. ఈ నెల 10న సీబీఐ కోర్టుకు హాజరుకావాలని అందులో పేర్కొంది. కడప సెంట్రల్ జైల్లో విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు దస్తగిరికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే మొత్తం ఐదుగురుకి నోటీసులిచ్చారు.హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యాక ఐదుగురు నిందితులనూ ఒకేసారి పిలవడం ఇదే తొలిసారి. కడప జైలులో రిమాండు ఖైదీలుగా ఉన్న సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలతో పాటు బెయిల్‌పై ఉన్న ఎర్రగంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరి 9న కడప నుంచి బయల్దేరి 10న ఉదయం 10.30 గంటలకు సీబీఐ కోర్టు ముందు హాజరుకానున్నారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న ముగ్గురు నిందితులకు ప్రొడక్షన్ వారెంట్ జారీ కాగా, బెయిలుపై ఉన్న మరో ఇద్దరికి సీబీఐ నుంచి సమన్లు అందాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com