పోలీసులపై కొల్లు రవీంద్ర ఫైర్‌..

పోలీసులపై కొల్లు రవీంద్ర ఫైర్‌..
మహిళలను అసభ్యంగా తాకుతూ, వారిని నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారని ఆగ్రహం

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆయన అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై సోమవారం మండిపడ్డారు . మహిళలను అసభ్యంగా తాకుతూ, వారిని నడిరోడ్డుపై ఈడ్చుకెల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పోలీసు సంఘాలకు కనిపించవా అని ప్రశ్నించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారికి పోలీసు సంఘం వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. పేర్ని నాని ఆదేశాలతోనే మహిళలను లాక్కెళ్లారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి 54 రోజులు రాజమండ్రి జైలులో పెట్టినా నాని కడుపు మంట చల్లారలేదన్నారు. పేర్ని నాని ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆగదన్నారు. కోట్ల విలువ చేసే భూమిని వైసీపీకి అప్పంగా అప్పగిస్తే ఊరుకునేది లేదన్నారు. న్యాయస్థానంలో దీనిపై పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story