పోలవరంపై తెలంగాణ డిమాండ్‌.. ఏపీ అంగీకారం

పోలవరంపై తెలంగాణ డిమాండ్‌.. ఏపీ అంగీకారం
పోలవరం ప్రాజెక్టు వల్ల కలిగే ప్రభావాలపై ఉమ్మడి సర్వేకు అంగీకరించిన ఏపీ ప్రభుత్వం

పోలవరం ప్రాజెక్టు నీటిమట్టంపై ఉమ్మడి సర్వే చేయాలన్న తెలంగాణ డిమాండ్‌కు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని కేంద్ర జల సంఘం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు వల్ల కలిగే ప్రభావాలపై ఉమ్మడి సర్వే చేయాలని తెలంగాణ కోరుతోంది. సర్వే తరవాత తగిన చర్యలను పోలవరం ప్రాజెక్టు అథార్టీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొంటాయని జలసంఘం వెల్లడించింది.

సుప్రీంకోర్టు ఆదేశంతో ఈ అంశంపై కేంద్ర జలసంఘం జనవరి 25న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశాలతోపాటు పోలవరం అథార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు గరిష్ఠ వరద ప్రవాహంపై మళ్లీ అధ్యయనం చేయిస్తామని జలసంఘం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story