అప్పుడే ప్రధానితో కలిసి అమరావతి శంకుస్థాపన చేశా

అప్పుడే ప్రధానితో కలిసి అమరావతి శంకుస్థాపన చేశా
రాజ్యాంగ బద్ధ పదవులు నిర్వహించిన తరువాత వివాదస్పద అంశాలపై వ్యాఖ్యానించకూడదు

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నపుడే ప్రధానమంత్రితో కలిసి అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మంత్రిగా ఉన్నపుడే నిధులు కూడా మంజూరు చేశానని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శనివారం జరిగిన ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్‌ 43వ వార్షికోత్సవంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.

అంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చూడాలా వైజాగ్‌ని చూడాలా అంటూ ప్రశ్నించిన విద్యార్థులకు వెంకయ్యనాయుడు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. రాజ్యాంగ బద్ధ పదవులు నిర్వహించిన తరువాత వివాదస్పద అంశాలపై వ్యాఖ్యానించకూడదు. ప్రజాభిప్రాయం ప్రకారమే నడచుకోవాలని వెంకయ్య స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story