మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం

మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం
X
ఒడిశా నుండి సరిహద్దు గ్రామాల్లోకి ప్రవేశించిన గజరాజులు

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒడిశా నుండి సరిహద్దు గ్రామాల్లోకి ప్రవేశించిన గజరాజులు కురుపాం మండలం సంజువాయి, బామిని మండలం మనుమ గ్రామాల్లో సంచరిస్తున్నాయి. కొండ సరిహద్దులోని కొమరాడ, జియ్యమ్మవలస, గురుబిల్లిలోని జీడితోటలో పంటలు నాశనం చేసాయి. దాంతో కురుపాం నియోజకవర్గం ప్రజలు, రైతులు భయాందోళనలో బిక్కుబిక్కుమంటున్నారు. మన్యం జిల్లాలో మొత్తం 17 ఏనుగులు సంచరిస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గజరాజుల తరలింపుపై అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

Tags

Next Story