కడపలో ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్ మరోసారి భూమి పూజ

కడపలో ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్ మరోసారి భూమి పూజ
గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం చంద్రబాబు, అంతకు ముందు దివంగత సీఎం వైఎస్ ఆర్‌లు కూడా భూమి పూజ చేశారు

కడపలో ఉక్కు పరిశ్రమకు ఇవాళ సీఎం జగన్ మరోసారి భూమి పూజ చేయనున్నారు. దీంతో జమ్మలమడుగులో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఇదే పరిశ్రమకు సీఎం జగన్ ఒకసారి భూమి పూజ చేయగా, గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం చంద్రబాబు, అంతకు ముందు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ఈ పరిశ్రమకోసం భూమి పూజ చేశారు.

సీఎం జగన్ ఇవాళ ఉదయం 10.15 గంటలకు విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాఫ్టర్లో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె చేరుకుంటారు. 11.35 గంటలకు ఉక్కు పరిశ్రమకు భూమిపూజ చేస్తారు. 12.45 గంటల వరకు ఉక్కు పరిశ్రమకు సంబంధించి సమీక్ష చేస్తారు.

మరోవైపు కడపలో ఉక్కుపరిశ్రమకు పలుమార్లు భూమిపూజలు జమ్మలమడుగులో శంకుస్థాపన చేస్తున్న ఉక్కు పరిశ్రమకు గతంలో 2019 డిసెంబర్ 23 సీఎం జగన్ భూమి పూజ చేశారు. ఇదే ఉక్కు పరిశ్రమకు గత ప్రభుత్వ హయంలో మాజీ సీఎం చంద్రబాబు 2018 డిసెంబర్ 27 న శంకుస్థాపన చేశారు. అంతకు ముందు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2007 జూన్ 10న భూమి పూజ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story