బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
కొరిసపాడు మండలం మేదరమెట్ల హైవేపై ప్రమాదం

బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ తోపాటు ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీ కొట్టింది. దీంతో కారు నుజ్జు అయింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదు గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగి నట్లు తెలుస్తుంది. అయితే ఈ కారు అద్దంకి ఎస్సై సమందర్‌ వలీదిగా గుర్తించారు. మృతులు ఎస్సై భార్య వాహిదా, కూతురు అయేషా, మరో ఇద్దరు మహిళలు, కారు డ్రైవర్‌గా గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story