అమరరాజా వాదనలు వినాలి: సుప్రీం

అమరరాజా వాదనలు వినాలని సుప్రీం కోర్టు ఏపీ పీసీబీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే షోకాజ్ నోటీసులపై చట్టపరంగా వెళ్లాలని సూచించింది. పీసీబీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని నాలుగు వారాలపాటు నిలిపి వేయాలని, ఆ సమయంలో సంస్థ ఏదైనా న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవచ్చని తెలిపింది.
ప్రతిపక్ష ఎంపీకి చెందిన ఫ్యాక్టరీ కావడంతోనే పీసీబీ నోటీసులు జారీ చేసిందని అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ సుప్రీంలో తన వాదనలు వినిపించింది. 2021-22 మధ్య 34 సార్లు తనిఖీలు చేసి తమ దృష్టికి వచ్చిన అంశాలను మద్రాస్ ఐఐటీకి పంపారు. అయితే సంస్థలో ఎలాంటి సమస్య లేదని మద్రాస్ ఐఐటీ నివేదిక ఇచ్చింది. అయినా ఫ్యాక్టరీ మూసివేయాలంటూ ఏపీ పీసీబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
1985 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమరరాజా సంస్ధలో 15 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. సంస్ధ తరుఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఆదినారాయణరావులు వాదనలు వినిపించారు. ఏపీ పీసీబీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఆత్మారాం నాదకర్ణి వాదనలు వినిపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com