గ్యాస్‌ట్రబుల్‌ అని ఆసుపత్రికి వెళితే ప్రాణాలే పోయాయి

గ్యాస్‌ట్రబుల్‌ అని ఆసుపత్రికి వెళితే ప్రాణాలే పోయాయి
డాక్టర్ నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని మృతుని తల్లిదండ్రులు ఆరోపన

రాజమండ్రిలో దారుణం జరిగింది. గ్యాస్ ట్రబుల్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరితే ప్రాణాలే కోల్పోవాల్సి వచ్చింది. దానవాయిపేటలోని రాజు న్యూరో ఆసుపత్రిలో ఇటీవలే కొత్తగా గ్రాస్ట్రో విభాగం ప్రారంభించారు. గ్యాస్ ట్రబుల్‌తో బాధపడుతున్న ఎంపీడీవో రత్నకుమారి కుమారుడు సందీప్‌ను చికిత్స నిమిత్తం చేర్చారు. ఎండోస్కోపీతో పాటు ఇతర పరీక్షలు చేసిన అనంతరం సందీప్ ప్రాణాలు కోల్పోయాడు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని మృతుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

అనుభవం లేకుండా ఆసుపత్రి నిర్వాహకులు తమ కుమారుడికి ట్రీట్‌మెంట్ చేయడంతోనే సందీప్‌ ప్రాణాలు కోల్పోయాడని మృతుని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని మృతుని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తన స్నేహితుడు సందీప్ మృతిపట్ల రాజమండ్రి ఎంపీ భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల డిమాండ్ మేరకు ఘటనపై విచారణ చేపట్టేలా కలెక్టర్‌ను కోరతామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story