కదిరి సీఐ మధు పై భగ్గుమంటున్న జర్నలిస్టులు

కదిరి సీఐ మధు పై భగ్గుమంటున్న జర్నలిస్టులు
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారినైనా వదిలేది లేదు

సత్యసాయి జిల్లా కదిరి సీఐ మధు వ్యవహరంపై జర్నలిస్టులు భగ్గుమంటున్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన సీఐని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఐ మధు తీరు సరిగ్గా లేదని.. మహిళలతో కూడా దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్‌ కదిరిలో పర్యటించారు. పట్టణంలోని పరిస్థితులపై ఆరా తీశారు. ఎస్పీ పర్యటన నేపథ్యంలో జర్నలిస్టులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వెళ్లి ఎస్పీని కలిసిన జర్నలిస్టులు తమపై జరిగిన దాడిని వివరించారు. విధి నిర్వహణలతో ఉన్న తమపై సీఐ మధు లాఠీ ఛార్జ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏ పోలీసు అధికారి కూడా తమ పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. తమపై విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు కుటుంబ సభ్యులను దూషించారని ఎస్పీకి తెలిపారు.

జర్నలిస్టుల ఫిర్యాదుపై స్థానిక డీఎస్పీ స్పందించారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుందని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారినైనా వదిలేది లేదని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story