అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది.రాత్రి పులివెందులలో ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు అధికారులు
రేపు హైదరాబాద్‌లోని సీబీఐ ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు.ఇప్పటికే అవినాష్‌రెడ్డిని రెండుసార్లు విచారించిన సీబీఐ మరోసారి అవినాష్‌రెడ్డితో పాటు భాస్కర్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు. రేపు కడప సెంట్రల్ జైల్‌లో భాస్కర్‌రెడ్డిని విచారణకు హాజరు కావాలని తెలిపారు ఇక ఈనెల 10న హైదరాబాద్ సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసు విచారణ జరగనుంది.
ఇప్పటికే ఈ కేసులో...గత నెల 28న అవినాష్‌రెడ్డి....హైదరాబాద్‌లోని సీబీఐ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులు పంపారు. ఒక్క రోజు తండ్రీ కుమారులను విచారణ పిలవడంతో ఈ కేసులో సీబీఐ దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది.
గతనెల 28న తొలిసారి సీబీఐ విచారణకు హాజరయిన అవినాష్ రెడ్డిని కాల్ డేటా ఆధారంగా సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఇపుడు మూడోసారి మరిన్ని విషయాలపై లోతుగా విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. భాస్కర్‌రెడ్డిని గతంలో రెండుసార్లు విచారించిన సీబీఐ... ఇప్పుడు మరోసారి ఎంక్వైరీ కోసం పిలిచింది. అయితే. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగినప్పటి నుంచి.. ప్రతిపక్షాల వేళ్లన్నీ ఎంపీ అవినాష్‌రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి వైపే చూపిస్తున్నాయి. 2020 మార్చి 11న హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టి 248 మంది సాక్షులు, అనుమానితులను విచారించి.. వాంగ్మూలాలను రికార్డు చేసింది.
మరోవైపు ఈ కేసులో నిందితుడైన గజ్జల ఉమాశంకరరెడ్డి భార్య స్వాతికి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.పులివెందులలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో నివాసం ఉంటున్న ఆమె ఇంట్లోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి దురుసుగా మాట్లాడారని,వివేకాను చంపింది నీ భర్తే కదా అంటూ ఆమెపై దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఆమె వెంటనే సెల్‌ఫోన్‌లో ఎస్పీ అన్బురాజన్‌కు, సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఎస్పీ ఆదేశాలతో పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని స్వాతిని విచారించారు. ఆమె తెలిపిన ఆధారాలతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, కడపకు తరలించినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com