శ్రీకాకుళం: ఆటో నుంచి గాల్లోకి ఎగిరిన ఐదువందల నోట్లు

శ్రీకాకుళం: ఆటో నుంచి గాల్లోకి ఎగిరిన ఐదువందల నోట్లు
X
మడపాం టోల్‌ప్లాజా వద్ద సంఘటన, టోల్‌ప్లాజా సిబ్బందికి దొరికిన 88 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

శ్రీకాకుళం జిల్లాలో 500 రూపాయల నోట్లు కలకలం రేపాయి. మడపాం టోల్‌ప్లాజా దగ్గర ఆటో నుంచి గాల్లోకి నోట్లు ఎగిరాయి. గాల్లోకి ఎగిరిన నోట్లను చూసిన టోల్‌ప్లాజా సిబ్బంది ఆటోను వెంబడించారు. అయితే ఆటో అతి వేగంతో దూసుకుపోవడంతో ఎంత ప్రయత్నించినా దొరకలేదు. దీంతో నోట్ల కట్టలపై టోల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.టోల్‌ప్లాజా సిబ్బందికి దొరికిన 88 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.. సీసీ టీవీలో ఫుటేజ్‌ ఆధరాంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story