వరుపుల రాజా అంత్యక్రియల్లో పాల్గొననున్న చంద్రబాబు

వరుపుల రాజా అంత్యక్రియల్లో పాల్గొననున్న చంద్రబాబు
ఆత్మీయ స్నేహి తుడు రాజా ఆకస్మిక మృతి షాక్‌కి గురిచేసిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కార్యదర్శి నారా లోకేష్

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎయిర్‌పోర్టుకి టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. ప్రత్తిపాడు ని యోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ వరుపుల రాజా అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ఎయిర్‌పోర్టు నుండి రోడ్డు మార్గాన ప్రత్తిపాడులోని పెదశంకర్లపూడి గ్రామానికి వెళ్లనున్నారు. కాసేపట్లో వరుపుల రాజా మృతదేహా నికి నివాళులర్పించనున్నారు.గుండెపోటుతో మృతిచెందిన వరుపుల రాజాకు టీడీపీ శ్రేణులు నివాళులర్పిస్తున్నాయి. ఆత్మీయ స్నేహి తుడు వరుపుల రాజా ఆకస్మిక మృతి షాక్‌కి గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. తెలుగుదేశం కుటుంబం యువనేతను కోల్పోయిందన్నారు. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉన్న రాజా మృతి పార్టీకి తీరని లోటు అని.. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూ తి తెలిపారు.

Read MoreRead Less
Next Story