నారా లోకేష్‌తో వంగవీటి రాధా భేటీకి రంగం సిద్ధం

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ యువ నేత నారా లోకేష్‌తో వంగవీటి రాధా భేటీకి రంగం సిద్ధమైనట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. నారా లోకేష్‌తో వంగవీటి రాధా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇద్దరు యువనేతల భేటీకి పీలేరు నియోజకవర్గం వేదిక కానుంది. ఇవాళ యువగళం పాదయాత్ర విడిది ప్రాంతంలో ఇరువురు నేతలు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా పలువురు నేతలతో వంగవీటి రాధా విస్తృత చర్చలు జరుపుతూ వచ్చారు. వివిధ రాజకీయ అంశాలు, ఇతర నేతల చర్చల్లో వచ్చిన అంశాలపై ఆయన లోకేష్‌తో చర్చిస్తారని తెలుస్తోంది. దీంతో ఈ భేటీలో ఏయే అంశాలపై చర్చిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. నారా లోకేష్, వంగవీటి రాధా భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఇరువురి సమావేశంపై రాజకీయ వర్గాల్లో చర్చోప చర్చలు జరుగుతున్నాయి. భేటీ తర్వాత లోకేష్‌తో కలిసి రాధా కూడా పాదాత్రలో పాల్గొంటారని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com