కాశీబుగ్గ కన్యకాపరమేశ్వరాలయంలో అపచారం

కాశీబుగ్గ కన్యకాపరమేశ్వరాలయంలో అపచారం
అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఓ వైసీపీ నేత పాలాభిషేకం

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ కన్యకాపరమేశ్వరాలయంలో అపచారం జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఓ వైసీపీ నేత పాలాభిషేకం చేయించుకున్నారు. పలాస వైశ్య సంక్షేమ సంఘం నేత, వైసీపీ చెందిన కోట్ని రమేష్‌ ఈ అపచారానికి పాల్పడ్డారు. కుల సంఘం ఎన్నికల్లో విజయం సాధించడంతో అత్యుత్సాహం ప్రదర్శించారు. అమ్మవారి ధ్వజ స్థంబం సమీపంలో పాలాభిషేకం చేయించుకున్నారు. ఇతను వైసీపీ నేత కావడంతో ఎవరూ అడ్డు చేప్పలేకపోయారు. పవిత్రంగా పూజించే అమ్మవారి దేవాలయంలో ఓ చోట నాయకుడు పాలభిషేకం చేయించుకోవడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయం పట్ల ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షులు శ్రీనివాస నంద సరస్వతి తీవ్రంగా మండిపడ్డారు. ఈ విధంగా చేయటం ముమ్మాటికి అపచారమంటున్నారు. దీనైపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story