9 March 2023 4:00 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / అరసవల్లిలో అద్భుత...

అరసవల్లిలో అద్భుత దృశ్యం.. సూర్యభగవానుడిని తాకిన సూర్య కిరణాలు

అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ఆరు నిమిషాల పాటు మూల విరాట్టును సూర్య కిరణాలు తాకయి. ఈ అద్భుత దృశ్యం భక్తులను కనువిందు చేసింది

అరసవల్లిలో అద్భుత దృశ్యం.. సూర్యభగవానుడిని తాకిన సూర్య కిరణాలు
X

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్యకిరణాలు తాకాయి. ఆరు నిమిషాల పాటు స్వామివారి మూల విరాట్టును సూర్య కిరణాలు తాకయి. ఈ అద్భుత దృశ్యం భక్తులను కనువిందు చేసింది. స్వామి వారి పాదాల నుండి శిరస్సు వరకు సూర్యకిరణాలు ప్రసరించడంతో అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ప్రతి సంవత్సరం రెండు సార్లు సూర్య కిరణాలు మూల విరాట్టును తాకుతుంటాయి. ఉత్తరాయణం మార్చి 9, 10 తేదీలలో దక్షిణాయణం అక్టోబర్ 1, 2 , 3 తేదీలలో స్వామివారిని సూర్య కిరణాలు తాకుతుంటాయి.

Next Story