నిన్నటికంటే నేడు బాగుంటే అభివృద్ధి జరిగినట్లే: సీఎం జగన్‌

నిన్నటికంటే నేడు బాగుంటే అభివృద్ధి జరిగినట్లే: సీఎం జగన్‌
X
మేనిఫెస్టో లోని అంశాలను 80 శాతం పూర్తి చేశామన్న జగన్‌

అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రసంగించారు. మేనిఫెస్టో లోని అంశాలను 80 శాతం పూర్తి చేశామని సీఎం తెలిపారు. విశ్వసనీయతే పునాదులుగా పని చేస్తున్నామన్నారు. కులం, మంతం, ప్రాంతం, తేడా లేకుండా పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. అవినీతికి తావులేకుండా డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నాము, ఇది గొప్ప మార్పుగా మేము భావిస్తావున్నామని సీఎం జగన్‌ తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చామన్నారు. అలాగే 51రెవిన్యూ డివిజన్‌లను 76వరకు పెంచామన్నారు. గ్రామ సచివాలయాల్లోనే 6వందల సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను ఏర్పాటు చేసి పౌరులకు సేవలందించడంలో ఇదొక విప్లవమని తెలిపారు. గ్రమాస్థాయిలో ఇప్పుడు అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి. పట్టణాల్లో 10,185 మంది సర్వేయర్లను అందుబాటులో ఉంచామన్నారు. వందేళ్ల తరువాత సమగ్ర భూసర్వే చేపట్టామని దీంతో కబ్జాలకు తావులేకుండా పోయిందన్నారు. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో మూడేళ్లుగా ఏపీది మొదటి స్థానమని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. నిన్నటికంటే నేడు బాగున్నప్పుడే అభివృద్ధి జరిగినట్టని సీఎం జగన్‌ వెల్లడించారు.

Next Story