సంచలనంగా మారిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి కామెంట్స్‌

సంచలనంగా మారిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి కామెంట్స్‌
చంద్రబాబుపై అంత అభిమానం ఉంటే పోయి తెలుగుదేశం పార్టీలో చేరరా

కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఆయన తీవ్ర దుర్భాషలాడారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చంద్రబాబుపై అంత అభిమానం ఉంటే పోయి తెలుగుదేశం పార్టీలో చేరరా అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇక్కడ డ్యూటీ చేయాల్సిన అవసరం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే తీరుపై అధికారుల వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Tags

Next Story