కంపెనీ వాళ్లు తప్పు చేయకుండా బాబు మాత్రమే తప్పు చేశారా? : పయ్యావుల

టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు.స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంపై నాలుగేళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏ పెద్దల ఖాతాల్లోకి నిధులు వెళ్లాయో డీటైల్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మీరు అదనంగా ఒక్క సెంటర్ అయినా ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని గొప్పగా చెప్పుకుంటున్న వైసీసీ ప్రభుత్వం ఆ ఉద్యోగాలు డెవలప్‌మెంట్ సెంటర్ నుంచి ఇవ్వలేదా అని పయ్యావుల నిలదీశారు. ఏదో కంపెనీలో అక్రమాలు జరిగితే రాష్ట్రప్రభుత్వానికేం బాధ్యత అని మండిపడ్డారు. సీమెన్స్ కంపెనీ ప్రతినిధుల్ని కూడా విచారణకు పిలవాలన్నారు. ప్రేమ్ చంద్రారెడ్డి, సెంట్రల్ డిజైన్ టీమ్ తప్పు చేయకుండా సీమెన్స్ తప్పుచేయకుండా చంద్రబాబు మాత్రమే తప్పు చేశారా అని ప్రశ్నించారు. ఈడీ దర్యాప్తులో చంద్రబాబుకు సంబంధం లేదని తేల్చేస్తారని బాధపడుతున్నారా అని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com