లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్సీలు.. మీరే రియల్ హీరోలు

లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్సీలు.. మీరే రియల్ హీరోలు
ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గకుండా సైకో పాలనపై మీరు చేసిన పోరాటం స్పూర్తిదాయకం

యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్‌ను నూతనంగా విజయం సాధించిన పట్టబధ్రుల ఎమ్మెల్సీలు రాంగోపాల్‌రెడ్డి, వేపాడ చిరంజీవి, శ్రీకాంత్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లోకేష్‌ వారికి శాలువా కప్పి సన్మానించారు. వైసీపీ అక్రమాలు ఎదురొడ్డి పోరాడిన మీరు రియల్‌ హీరోలు అంటూ ప్రశంసించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గకుండా సైకో పాలనపై మీరు చేసిన పోరాటం స్పూర్తిదాయకమన్నారు. ప్రజా సమస్యలపై మండలిలో గళం వినిపించాలన్నారు. తమపై నమ్మకం పెట్టుకొని సీటిచ్చిన మీకే మా గెలుపును అంకితం చేస్తున్నామని తెలిపారు ముగ్గురు ఎమ్మెల్సీలు. 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం లోకేష్‌ డైరెక్షన్‌లో పని చేస్తామని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story