శాప్‌ మీటింగ్‌లో బైరెడ్డి అనుచరుల రౌడీయిజం

శాప్‌ మీటింగ్‌లో బైరెడ్డి అనుచరుల రౌడీయిజం
రాయలసీమ రౌడీయిజం ఇక్కడ చేయోద్దంటూ కేపీ రావు వార్నింగ్‌

విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం శాప్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరుల రౌడీయిజం ప్రదర్శించారు. దీంతో శాప్‌ సమావేశం రసాభాసగా మారింది. అన్ని స్పోర్ట్స్‌ అసోసియేషన్లతో శాప్‌ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో శాప్‌- ఒలంపిక్‌ అసోసియేషన్‌ సభ్యుల మధ్య వివాదం ఏర్పడింది. ఒలంపిక్‌ అసోసియేషన్‌ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా బైరెడ్డి అనుచరులు సభ్యులపై దుర్భాషలాడారు. దీంతో రాయలసీమ రౌడీయిజం ఇక్కడ చేయోద్దంటూ కేపీ రావు వారికి వార్నింగ్‌ ఇచ్చారు. కోపోద్రీక్తులైన బైరెడ్డి అనుచరులు ఆయనపై వీరంగం సృష్టించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది.

Tags

Read MoreRead Less
Next Story