సస్పెండ్‌ చేసినందుకు చాలా హ్యాపీ.. బరువంతా దిగింది: మేకపాటి

సస్పెండ్‌ చేసినందుకు చాలా హ్యాపీ.. బరువంతా దిగింది: మేకపాటి
నాలుగున్నరేళ్ల అధికారాన్ని వదులు కొని అప్పట్లో రాజశేఖర్ రెడ్డి కుమారుడికి సపోర్ట్‌ చేయాలని వచ్చాను

క్రాస్‌ ఓటింగ్‌ విషయంలో సస్పెండ్‌ పై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి స్పందించారు. సస్పెండ్‌ చేస్తే హ్యాపీ నా బరువంతా దిగిపోయిందన్నారు. నాలుగున్నరేళ్ల అధికారాన్ని వదులు కొని అప్పట్లో రాజశేఖర్ రెడ్డి కుమారుడికి సపోర్ట్‌ చేయాలని వచ్చానన్నారు. పార్టీలో కంటెస్ట్‌ చేసి ఖర్చు పెట్టుకున్నామన్నారు. పార్టీ కోసం కష్టపడ్డామాని, నేనెప్పుడూ సీఎం జగన్‌తో అమర్యాదగా ప్రవర్తించలేదన్నారు. కానీ పార్టీ నాపట్ల అమర్యాదకరంగా ప్రవర్తించిందన్నారు. నియోజకవర్గంలో నాకు వ్యతిరేకంగా మనుషుల్ని పంపారన్నారు. వైసీపీలో నన్ను అవమానించారని మేకపాటి వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story