శ్రీదేవి గోడు.. మైండ్ బ్లాక్ అయింది.. రిటర్న్ గిఫ్ట్ పక్కా

సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వెల్లడించారు. ఆమెకు పోలీసుల రక్షణ కల్పించాలన్నారు. వైసీపీ గుండాలు రకరకాలుగా తనను వేధిస్తున్నారని శ్రీదేవి పేర్కొన్నారు. సోషల్‌మీడియాలో తనపై అసభ్యకరంగా రాస్తున్నారని తెలిపారు. శ్రీదేవి ఎక్కడని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. ఆమె ఎవరికి ఓటు వేశానో తెలియకుండా ఒష్టమొచ్చినట్లు మాట్లాడారన్నారు. దాచుకో పంచుకో తినుకో అని జగన్ చెబుతారని ఆమె వెల్లడించారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రజా సంపదను ఎవరు దోచుకుంటున్నారో జగన్ చెప్పాలని ప్రశ్నించారు. శ్రీదేవిని రాజధానిలో తప్పించాలని వారి పక్కాప్లాన్ అని తెలిపారు.
ఓటు వేసేందుకు 15కోట్లు తీసుకున్నానని ఆమెపై తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన చెందారు. ఎమ్మెల్సీకి ఓటు వేస్తే ఎవరైనా 15కోట్లు ఇస్తారా అని శ్రీదేవి ప్రశ్నించారు. తనపై పిచ్చి కుక్క అని ముద్రవేస్తున్నారన్నారు. అమరావతి రైతులకు ఏం చేయలేక పోతున్నానని మదనపడేదానినని శ్రీదేవి పేర్కొన్నారు. అమరావతికి సీఎం జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. నాప్రాణంపోయినా అమరావతి కోసం నిలబడుతానని అమరావతి ప్రజలకు హామీ ఇచ్చారు. నాలుగేళ్లు బానిస సంకెళ్లలో ఉన్నానని శ్రీదేవి తెలిపారు. నేను డబ్బు తీసుకున్నానని అమరావతి మట్టిపై ప్రమాణం చేసి చెప్పండి, నా కార్యాలయంపై దాడి చేసిన వారు అమరావతికి వస్తారా కాణిపాకం వస్తారా రండి తేల్చుకుందామని సవాల్ విసిరారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని పేర్కొంది. జగన్ కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయిందిని వైసీపీకి మంచి రిటర్న్ గిఫ్ట్ కచ్చితంగా ఇస్తానని వెల్లడించింది. దళిత ఎమ్మెల్యే ఏమీ చేయలేదనుకుంటున్నారు కానీ ఏం చేయగలనో చూపిస్తానని శ్రీదేవి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com