ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందేమో: డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు ఓడిపోయారంటే ఆ మేరకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందేమోనని వ్యాఖ్యానించారు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. సరిదిద్దుకోవడానికి ఇదే మంచి అవకాశంగా భావిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని అన్ని విధాలుగా నిర్ధారించిన తర్వాతే నలుగురిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. సస్పైండైన వారు పశ్చాతాపపడటం లేదన్నారు. ఎక్కడో వైద్య వృత్తి చేసుకుంటున్న శ్రీదేవిని తెచ్చి గెలిపించామని, కానీ ఆమె ఎనాడు పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కాలేదన్నారు. ప్రజల్లో ఆమెపై విశ్వాసం లేదనే పార్టీ ఇంఛార్జ్‌ని మార్చినట్లు తెలిపారు. మంత్రి పదవులు ఇవ్వకపోతే.. పార్టీ మారే ఆనవాయితీ ఆనంకు ఉందని ఎద్దేవా చేశారు. భవిష్యతులో ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ఓటు వేసినా చర్యలు తీసుకుంటామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com