ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు గడపగడపలో తప్పని నిరసన సెగ

ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు గడపగడపలో తప్పని నిరసన సెగ
వచ్చే ఎన్నికల్లో ఓటు ఎవరికి వేస్తారని అడుగగా.. సైకిల్‌ గుర్తుకు వేస్తామని తెగేసి చెప్పిన గ్రామస్థులు

వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసన సెగలు తప్పడం లేదు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు ఎక్కడిక్కడ నిలదీస్తున్నారు ప్రజలు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్‌ ను సంక్షేమ పథకాలపై నిలదీశారు. జి. సిగడాం మండలం అద్దానం పేటలో పర్యటించిన ఎమ్మెల్యేను రోడ్లు, ఉద్యోగాలపై నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఓటు ఎవరికి వేస్తారని అడుగగా.. సైకిల్‌ గుర్తుకు వేస్తామని తెగేసి చెప్పారు గ్రామస్తులు. అయితే తమకు మద్దతు ఇవ్వకుంటే సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించారు. ఎమ్మెల్యేను స్థానికులు నిలదీయడంతో వెనుదిరిగారు.

Tags

Read MoreRead Less
Next Story