ఏపీలో నారా లోకేష్ ప్రభంజనం.. జనసునామీని తలపిస్తున్న పాదయాత్ర

ఏపీలో నారా లోకేష్ ప్రభంజనం.. జనసునామీని తలపిస్తున్న పాదయాత్ర
వేలాది మంది యువత అడుగులో అడుగులు వేస్తున్నారు. రహదారులన్నీ పసుపుమయంగా మారిపోతున్నాయి

ఏపీలో నారా లోకేష్ ప్రభంజనం కొనసాగుతుంది. యువగళం పాదయాత్ర జనసునామీని తలపిస్తుంది. యువనేత ఎక్కడికి వెళ్లిన ఘన స్వాగతం లభిస్తోంది. లోకేష్‌ వెంట వేలాది మంది యువత అడుగులో అడుగులు వేస్తున్నారు. రహదారులన్నీ పసుపుమయంగా మారిపోతున్నాయి. పాదయాత్రలో కీలోమీటర్ల మేర జనం క్యూ కడుతున్నారు. యువనేతను కలిసుకుని తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. అందరి సమస్యలు ఓపిగా వింటున్న లోకేష్‌.. టీడీపీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 54 వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 676.5 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. ఇవాళ పెనుగొండ నియోజకవర్గంలో లోకేష్‌ పాదయాత్ర కొనసాగనుంది. ఉదయం 8గంటలకు నల్లగొండ్రాయనపల్లి విడిది కేంద్రంలో బ్రాహ్మణ సామాజికవర్గీయులతో భేటీ అవుతారు. అనంతరం పాదయాత్ర ప్రారంభం కానుంది.

8.25 నిమిషాలకు సోమందేపల్లి దళితవాడలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం కానున్నారు. 8.50నిమిషాలకు సోమందేపల్లిలో మహిళలతో భేటీ అయి వారి సమస్యలు తెలుసుకుంటారు. 9.20 నిమిషాలకు సోమందేపల్లి ఎన్టీఆర్ సర్కిల్ లో చేనేతలతో సమావేశం అవుతారు. 10.30 నిమిషాలకు వెంకటాపురం తండాలో స్థానికులతో మాటామంతీలో పాల్గొంటారు.

ఇక మధ్యాహ్నం 12.35 నిమిషాలకు పెనుకొండ ఆర్చి వద్ద స్థానికులతో మాటామంతీ పాల్గొని వారి సమస్యలు తెలుసుకుంటారు. ఒంటిగంటకు పెనుకొండ ఎన్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ లో వ్యాపారులతో సమావేశం అవుతారు. 2గంటలకు పెనుకొండ ఎన్ గ్రాండ్ కన్వెన్షన్ లో భోజన విరామం తీసుకుంటారు. ఇక సాయంత్రం 3గంటలకు పెనుకొండ ఎన్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ లో కురుబ సామాజికవర్గీయులతో ముఖాముఖిలో పాల్గొంటారు లోకేష్. 4గంటలకు పెనుకొండ ఎన్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. రాత్రి 8గంటలకు పెనుకొండ క్రాస్ వద్ద 54వ రోజు పాదయాత్రను ముగిస్తారు. ఇక అడ్కడే విడిది కేంద్రంలో రాత్రికి లోకేష్ బస చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story