దురంతో ఢీ.. దుగ్గు దుగ్గైన బొలెరో

ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే గేటు వద్ద భారీ ప్రమాదం జరిగింది. బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 5 గంటలకు పైగా రైలు నిలిచిపోయింది. దురంతో ఎక్స్‌ప్రెస్ వస్తుండటంతో భీమడోలు జంక్షన్ వద్ద రైల్వే గేటును సిబ్బంది వేశారు. అదే సమయంలో బొలెరోలో వచ్చిన వ్యక్తులు వాహనంతో రైల్వే గేటును ఢీకొట్టి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో బొలెరో వాహనం రైల్వే ట్రాక్‌పైకి వచ్చింది. అదే సమయంలో దురంతో ఎక్స్‌ప్రెస్ రావడంతో అందులో ఉన్న వ్యక్తులు వాహనాన్ని వదిలేసి పారిపోయారు. ఈ క్రమంలో రైలు ఢీకొనడంతో బొలెరో వాహనం ధ్వంసమైంది.
ఇంజిన్ దెబ్బతినడంతో దురంతో ఎక్స్‌ప్రెస్ ఆగిపోయింది. దాదాపు ఐదు గంటలుగా నిలిపివేశారు. మరో ఇంజిన్ అమర్చేందుకు రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు రైల్వేపోలీసులు. బొలెరో వాహనంలో వచ్చినవాళ్లు దొంగలా? పారిపోయేందుకే గేటును ఢీకొట్టారా? లేదా మరేదైనా కారణమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com