ఇదీ చంద్రబాబు ఘనత .. లోకేష్ సంతోషం

పెనుగొండ నియోజకవర్గంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. 55 వ రోజు పాదయాత్ర చేస్తున్న లోకేష్ కియా పరిశ్రమను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఆ పరిశ్రమ ముందు.. సెల్ఫీ దిగి సీఎం జగన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు. ఇదీ చంద్రబాబు ఘనత అంటూ పరిశ్రమను చూపించారు. కియా పరిశ్రమతోనే 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఇది అబద్ధమని జగన్ రెడ్డి చెప్పగలడా? అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. పరోక్షంగా లక్షలాది మందికి కియా ద్వారా లబ్ది చేకూరలేదా ? అంటూ నిలదీశారు. నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమ ముందైనా జగన్ రెడ్డి సెల్ఫీ దిగి చూపగలరా? అంటూ ఎద్దేవాశారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక పరిశ్రమల ద్వారా వచ్చాయని... 6లక్షల ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వమే ఒప్పుకుంది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు. ఒక్క కియా అనే కాదు, ఉమ్మడి అనంతపురం జిల్లాకు తయారీ రంగం హబ్ చేయాలని చంద్రబాబు సంకల్పించారన్నారు. అందుకనుగుణంగానే ప్రతీ జిల్లాకు అభివృద్ధి ప్రణాళిక విజన్ రూపొందించారన్నారు. అభివృద్ధి లో ఏపీ దేశంలో నంబర్1 గా ఎందుకు ఉండకూడదనే సంకల్పంతో పని చేశామన్నారు. ఇప్పుడు అరాచకాల్లో ఏపీ ని నెంబర్1 చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందంటూ విమర్శించారు లోకేష్. గత టీడీపీ హాయంలో ఎన్నో అభివృద్ధి పనలు చేసినా తాము ప్రచారం చేసుకోలేకపోయామని, కానీ జగన్ మాత్రం ఏమీ అభివృద్ధి చేయకపోయినా ఉత్తిత్తి ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
చంద్రబాబు అంటే ఒక బ్రాండన్నారు లోకేష్. అప్పట్లో హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేశారో.. ఇప్పుడు ఏపీని సైతం అలాగే అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారన్నారు. ప్రతిజిల్లాలో ఒక పరిశ్రమ తెచ్చేందుకు ప్రయత్నించారన్నారు. అనంతపురం జిల్లాలో కియా తీసుకురావడంతో.. వేలమందికి ఉపాధి కలిగిందన్నారు. ఒక్క పక్కా ప్రణాళికలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించారన్నారు. ఇప్పుడు కియా చూస్తుంటే.. ఆనందం వేస్తుందున్నారు. పరిపాలన కేంద్రీకరించి.. అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com