అక్రమంగా కడుతున్న అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌ను ఆపాలి: అఖిలపక్ష పార్టీలు

అక్రమంగా కడుతున్న అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌ను ఆపాలి: అఖిలపక్ష పార్టీలు
అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు సెంట్రల్‌ బోర్డు అనుమతులు లేకున్నా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం నిధులు ఇస్తుందని విమర్శించారు

కర్ణాటకలో అక్రమంగా కడుతున్న అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని ఆపాలని.. అనంతపురంలో అఖిలపక్ష పార్టీలు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో నిర్మించాలని నేతలు డిమాండ్‌ చేశారు. అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు సెంట్రల్‌ బోర్డు అనుమతులు లేవని.. కానీ కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం నిధులు ఇస్తుందని విమర్శించారు. తుంగభద్ర మిగులు జలాలు శ్రీశైలంలోకి రావడం లేదన్నారు. రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతున్నా.. వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్‌ పాలనలో రాయలసీమ ఎడారి అయ్యే ప్రమాదం ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story