లోకేష్‌ పాదయాత్రను బద్నాం చేయాలని జగన్‌ సర్కార్‌ నానా తంటాలు

లోకేష్‌ పాదయాత్రను బద్నాం చేయాలని జగన్‌ సర్కార్‌ నానా తంటాలు
రోజురోజుకు లోకేష్‌ను చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. మరోవైపు.. ఆయనతో సెల్పీల కోసం జనం క్యూ కడుతున్నారు

యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టిన లోకేష్‌కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికెళ్లిన ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. రోజురోజుకు లోకేష్‌ను చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. మరోవైపు.. ఆయనతో సెల్పీల కోసం జనం క్యూ కడుతున్నారు. దీంతో జగన్‌ సర్కారుకు చిర్రెత్తుకొస్తోంది. లోకేష్‌ పాదయాత్రను ఎలాగైనా బద్నాం చేయాలని ఇప్పటికే నానా తంటాలు పడింది. జీవో నెంబర్‌తో ఇబ్బందులు సృష్టించింది. అయినా ఫలితం లేకపోయింది. దీంతో పాదయాత్ర ఇంత సక్సెస్‌ కావడానికి కారణలేంటో తెలుసుకోవాల్సిందేనంటూ.. పైనుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో మళ్లీ రంగంలో దిగారు పోలీసులు. ఇప్పుడు మరింత నిఘా పెంచారు. డ్రోన్లను విస్తృతంగా వాడుకుంటున్నారు. లోకేష్‌ పాదయాత్రను ఎప్పటికప్పుడు డ్రోన్‌తో చిత్రీకరిస్తూ.. ఆయా జిల్లాల ఎస్పీలకు పంపుతున్నారు. మీడియా వ్యాన్ లో కూర్చొని యువగళం పాదయాత్ర విషయాలన్నీ ఎప్పటికప్పుడు ఎస్పీ ఆఫీస్‌కి చేరవేస్తున్నారు ఇంటెలిజెన్స్ పోలీసులు. అంతేకాదు యువగళం పేరుతో ఓ గ్రూప్ ఏర్పాటు చేసుకుని... పాదయాత్ర సమాచారాన్ని తమ ఉన్నతాధికారులతో పంచుకుంటున్నారు పోలీసులు.

తాజాగా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు గ్రామస్థులు. అదే సమయంలో లోకేష్ పైన ఓ పోలీసు డ్రోన్ ఎగరడం కలకలంరేపింది. దీంతో పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ ఆగి ఆ డ్రోన్‌ ఎగురుతండగా సెల్ఫీ తీసుకున్నారు. అంతేకాదు అయ్యా జగన్... మీరు నన్ను చూడాలనుకుంటే... యూట్యూబ్ లైవ్ లింక్ పంపిస్తానంటూ...డ్రోన్ ఎగురుతున్న వీడియో రీలిజ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story