సీఎం జగన్‌తో.. సీఆర్డీఏ అధికారుల భేటీ

సీఎం జగన్‌తో.. సీఆర్డీఏ అధికారుల భేటీ

సీఎం జగన్‌తో.. సీఆర్డీఏ అధికారులు భేటీ అయ్యారు. అమరావతిలో సెంటు భూమి పథకంపై చర్చించినట్లు తెలుస్తోంది. అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి సెంటు భూమి పట్టాలు ఇచ్చేందుకు సీఆర్డీఏ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 1130 ఎకరాలను కేటాయిస్తు జీవో నెంబర్‌ 45 రిలీజ్‌ చేసింది జగన్ సర్కారు. గుంటూరు కలెక్టర్‌కు 550, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు 583 ఎకరాలు కేటాయించింది. ఎకరానికి కోటి రూపాయల ధరగా ప్రభుత్వ నిర్ణయించింది. ధరను మళ్లీ సమీక్షించుకోవచ్చంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనిపై చర్చించేందుకు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు సీఆర్డీఏ అధికారులు.

రాజధానిలో... ఇతర ప్రాంతాలవారికి భూములివ్వడంపై రైతుల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ వీరి అభ్యంతరాలు పట్టించుకోకుండా ఇప్పటికే ఆర్-5 జోన్ ఏర్పాటు చేశారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా పట్టాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న రైతులు R5 జోన్ పై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ హైకోర్టు స్వీకరించింది. మధ్యాహ్నం 2.15 నిమిషాలకు విచారణ జరగనుంది. R5 జోన్ పై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.

Tags

Next Story