మైనింగ్,ఇరిగేషన్ శాఖల్లో పెరిగిన అవినీతి: సోమిరెడ్డి

మైనింగ్,ఇరిగేషన్ శాఖల్లో పెరిగిన అవినీతి: సోమిరెడ్డి
X
అక్రమాలు బయటపడతాయనే ఉద్యోగులను వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు

త్వరలోనే వైసీపీ నేతల అక్రమాలను బయటపెడతామన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి. అక్రమాలు బయటపడతాయనే ఉద్యోగులను వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. అక్రమ లేఅవుట్లలో కొందరు అధికారుల పాత్రపై..మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి ఏం చెబుతారని ప్రశ్నించారు. తమ పోరాటం ప్రభుత్వ ఉద్యోగులందరిపై కాదన్న సోమిరెడ్డి..మైనింగ్,ఇరిగేషన్ శాఖల్లోని అవినీతి పెరిగిపోయిందన్నారు. సర్వేపల్లి రిజర్వాయర్‌లో జరిగిన గ్రావెల్ దందాలో వైసీపీ ఎంపీ పై కేసులు పెట్టి చేతులు దులుపేసుకున్నారని ఆరోపించారు. అవినీతి, అక్రమాలకు తెరలేపిన కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు పరువును పెన్నానదిలో కలిపేశారని, మైనింగ్,ఇరిగేషన్,శాఖల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాల బండారం బయట పెట్టబోతున్నామన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి.

Tags

Next Story