సల్లబడ్డ సీఎం..పరాజయాన్ని తక్కువ చేసి చూపించేందుకు తంటాలు..!

సల్లబడ్డ సీఎం..పరాజయాన్ని తక్కువ చేసి చూపించేందుకు తంటాలు..!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయంతో సీఎం జగన్‌ భయం? గతంలో పనిచేయని ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్‌ వార్నింగులు ఇప్పుడు బుజ్జగింపులు ?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయంతో సీఎం జగన్‌ భయపడ్డారా..? గతంలో పనిచేయని ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్‌ వార్నింగులు ఇచ్చిన ఆయన... ఇప్పుడు అసమ్మతి సెగలను చల్లార్చేందుకు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా..? గతంలో కంటే భిన్నంగా సాగిన గడప గడపకు మన ప్రభుత్వం వర్క్‌ షాప్‌ చూస్తుంటే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోందా..? గత వర్క్‌ షాపుల్లో ఎమ్మెల్యేల పనితీరుపైనే ప్రధాన చర్చ జరిగింది.. సర్వే రిపోర్టులను బయటపెట్టి పనితీరు బాగా లేని వారికి క్లాస్‌ తీసుకునే వారు జగన్‌.. పనితీరు మారకుంటే సీట్లుండవని హెచ్చరించారు.. అయితే, ఇవాళ జరిగిన వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యేల విషయంలో జగన్‌ కొంత వెనక్కు తగ్గినట్లుగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.. ఎమ్మెల్యేల పనితీరుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని జగన్‌.. టీడీపీపై విమర్శలకే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. 60 మందికి సీట్లుండవని విష ప్రచారం చేస్తున్నారని ఆయన వర్క్‌షాప్‌ వేదికగా విపక్షాలపై మండిపడ్డారు.. అంతేకాదు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు చాలా కష్టపడ్డారు.. ఎమ్మెల్సీ ఎన్నికల పరాజయాన్ని తక్కువ చేసి చూపించేందుకు సమావేశంలో జగన్‌ తంటాలు పడ్డట్లుగా ఆపార్టీ వర్గాలే అనుకుంటున్నాయి.


Read MoreRead Less
Next Story