మహిళలతో లోకేష్‌ ముఖాముఖి..జగన్‌ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం

మహిళలతో లోకేష్‌ ముఖాముఖి..జగన్‌ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం

ప్రజల కష్టాలు తీరాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని మహిళలు ముక్త కంఠంతో నినదిస్తున్నారు.. ధర్మవరం నియోజకవర్గంలోని కృష్ణంరెడ్డిపల్లిలో మహిళలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు. జగన్‌ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. ధరలన్నీ పెంచేశారని వాపోయారు. గత ప్రభుత్వ పథకాలన్నీ కట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వస్తేనే తమ కష్టాలు తీరుతాయన్నారు. వచ్చేది చంద్రబాబు ప్రభుత్వమేనని.. అందులో డౌటే లేదన్నారు నారా లోకేష్‌. మహిళలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story