ఎమ్మెల్యే కళావతిని అడ్డుకున్న ఆదివాసీలు

ఎమ్మెల్యే కళావతిని అడ్డుకున్న ఆదివాసీలు

పాలకొండ వైసీపీ ఎమ్మెల్యే కళావతికి నిరసన సెగ తగిలింది. ఆసరా కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యేను ఆదివాసీలు అడ్డగించారు. బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం పెట్టడం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గిరిజన ద్రోహి అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడకి చేరుకున్న పాలకొండ టీడీపీ ఇన్ఛార్జ్ జయకృష్ణ, ఎమ్మెల్యే కళావతికి మధ్య వాగ్వాదం నెలకొంది. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

Read MoreRead Less
Next Story