ఎమ్మెల్యే ధనలక్ష్మిని నిలదీసిన గిరిజనులు

ఎమ్మెల్యే ధనలక్ష్మిని నిలదీసిన గిరిజనులు
ఇతర కులాలను ఎస్టీలో చేర్చుతుంటే అసంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్యేను నిలదీశారు

వైసీపీ ఎమ్మెల్యేలకు గిరిజనుల నుంచి వరుసగా నిరసన సెగలు తగులుతున్నాయి. తాజాగా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మికి చేదు అనుభవం ఎదురయ్యింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక, కూనవరం మండలాల్లో ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేను గిరిజన సంఘం నేతలు అడ్డుకున్నారు. ఇతర కులాలను ఎస్టీలో చేర్చుతుంటే అసంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. కారుదిగొచ్చిన ఎమ్మెల్యే గిరిజన సంఘం నేతలకు సర్థి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. జీవో నెంబర్ 52 వెంటనే రద్దు చేయాలని లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని గిరిజన సంఘం నేతలు హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story