డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ రెండో దశ ఉద్యమం

డిమాండ్ల సాధన కోసం  ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ రెండో దశ ఉద్యమం

తమ డిమాండ్ల సాధన కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నేతలు రెండో దశ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈనెల 29 వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని నిర్ణయించారు. ఎల్లుండి నల్ల కండువాలతో ముఖ్య కూడళ్లలో నిరసన ప్రద ర్శనలు నిర్వహించనున్నారు. 10న గ్రీవెన్స్‌ డే రోజున స్పందనలో కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని డిసైడయ్యారు. 11న సెల్‌ డౌన్‌ కార్యక్రమం, 12న 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు, 15న మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఏపీ జేఏసీ నేతలు పరామర్శించనున్నారు. 19న సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయ సమస్యలపై ధర్నాలు నిర్వహించాలని నిర్ణయిం చారు. 20న జీతాలు సకాలంలో చెల్లించాలని, పెనాల్టీల నుంచి విముక్తి కల్పించాలని బ్యాంకులను సందర్శించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story