ఏపీ‌ పరిస్థితులపై ప్రధాని మోదీ ఆందోళన

ఏపీ‌ పరిస్థితులపై ప్రధాని మోదీ ఆందోళన

ఏపీ‌లోని పరిస్థితులపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. తనను కలిసిన టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌తో మోదీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. కు టుంబ సభ్యులతో కలిసి ప్రధానిని కలిశారు టీడీపీ ఎంపీ కనకమేడల. ఈ సందర్భంగా ఏపీలో పరిస్థితులు ఇద్దరి మధ్యా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సిచ్యు యేషన్‌ ఏంటని మోదీ ఆరా తీశారు. ఈ సందర్భంగా పాలకపక్షం అన్యాయాలు, అక్రమాలను కనకమేడల ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ఆర్థిక, శాంతి భద్రతల పరిస్థితులు తన దృష్టిలో ఉన్నాయని ప్రధాని చెప్పారన్నారు. ఐదు కోట్ల ప్రజలను మీరే కాపాడాలన్న తన విజ్ఞప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. గతంలో చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లారని కనకమేడల చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story